రూ.1.40 లక్షల కొత్త బైక్.. పూర్తి వివరాలు | Bajaj Pulsar N160 With USD Fork Launched, Check Indian Price And Specifications Details | Sakshi
Sakshi News home page

Bajaj Pulsar N160: రూ.1.40 లక్షల కొత్త బైక్.. పూర్తి వివరాలు

Published Sat, Jun 15 2024 2:11 PM | Last Updated on Sat, Jun 15 2024 2:49 PM

Bajaj Pulsar N160 With USD Fork Launched Full Details

బజాజ్ ఆటో భారతదేశంలో పల్సర్ ఎన్160 పేరుతో మరో కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. కొత్త వేరియంట్ ఇప్పుడు అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఏబీఎస్ మోడ్‌లను పొందుతుంది. ఈ బైక్ ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్ షోరూమ్).

చూడటానికి స్టాండర్డ్ బజాజ్ పల్సర్ ఎన్160 మాదిరిగా అనిపించినప్పటికీ.. ఇందులోని డిజిటల్ కన్సోల్ బ్లూటూత్ కనెక్టివిటీని పొందుతుంది. కాబట్టి టర్న్ బై టర్న్ న్యావిగేషన్, ఇతర కనెక్టెడ్ ఫీచర్లను సులభంగా పొందవచ్చు. ఈ బైక్ ఇప్పుడు రెయిన్, రోడ్, ఆఫ్-రోడ్ అనే మూడు రైడింగ్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది.

కొత్త పల్సర్ ఎన్160 మోడల్ సాధారణ మోడల్ మాదిరిగానే 164.82 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 8750 rpm వద్ద 16 హార్స్ పవర్, 6750 rpm వద్ద 14.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇంజిన్‌లో ఎటువంటి అప్డేట్ లేదు, కాబట్టి అదే పనితీరును అందిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement