Apple pay in 4: ఇప్పుడు కొనుక్కోండి తర్వాతే పే చేయండి

Apple Upcoming Plans Buy Now, Pay Later Service - Sakshi

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ యాపిల్  తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. డబ్బులు చెల్లించకుండా మనకు కావాల్సిన యాపిల్‌ ఉత్పత్తుల్ని  సొంతం చేసుకునే సదుపాయం కల్పించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2019లో యాపిల్‌ సంస్థ యాపిల్‌ క్రెడిట్‌​ కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ కార్డ్‌ ద్వారా యాపిల్‌ సంస్థకు చెందిన గాడ్జెట్స్‌ కొనుగోలు చేసుకునే సౌకర్యం ఉంది. అయితే తాజాగా యాపిల్‌ సంస్థ  'యాపిల్‌ క్రెడిట్‌ కార్డ్‌'తో సంబంధం లేకుండా ఏదైనా ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి, వాటికి మనీని తర్వాత పే చేసే అవకాశం కల్పించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమచారం.   

ఇందుకోసం యాపిల్‌ సంస‍్థ పేమెంట్‌ గేట్‌వే గోల్డ్‌ మెన్‌ సాచ్స్ తో జతకట‍్టనుంది. 'యాపిల్‌ పే ఇన్‌ 4'  'యాపిల్‌ పే ఇన్‌ మంత్లీ సిస్టమ్‌ పేరుతో ఈ స్కీమ్‌లో భాగంగా యాపిల్‌ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసిన కష్టమర్లు పేమెంట్‌ గేట్‌ వే గోల్డ్‌ మెన్‌ సాచ్చ్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన ఉత్పత్తులపై యాపిల్‌ విధించిన వారాల గడువులోపు పే చేస‍్తే వడ్డీ ఉండదు. నెలల వ్యవధి ఉంటే వాటిపై ఇంట్రస్ట్‌ను చెల్లించాల్సి ఉంది.  

ఈ సదుపాయం ప్రస్తుతం రీటైల్‌, ఆన్‌లైన్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉందని యాపిల్‌ సంస్థ ప్రతినిథులు తెలిపారు. యాపిల్ పే లేటర్ సేవను ఉపయోగించాలనుకునే వినియోగదారులు ఐఫోన్ యాప్‌లో అప్లయ్‌ చేసి అనుమతి పొందాల్సి ఉంటుందాఇ. అప్పుడే యాప్‌ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతేకాదు కొన్ని ఉత్పత్తులపై అడిషనల్‌ ఛార్జెస్‌ , ప్రాసెసింగ్ ఫీజుల్ని మినహాయింపు, క్రెడిట్‌ కార్డ్‌ స్కోర్‌ అవసరం లేకుండా ఉత్పత్తుల కొనుగోళ్లపై చర్చిస్తోంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top