రిలయన్స్‌ ఇన్‌ఫ్రా.. గాడిన పడేనా

Anil Ambani Reliance Infra Raise Rs 550 Crore Funds Through Preferential Allotment - Sakshi

నిధుల సమీకరణలో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా

యాక్టివ్‌ అవుతున్న అనిల్‌ అంబానీ

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తన సంస్థలను మళ్లీ గాడిన పెట్టేందుకు అనిల్‌ అంబానీ సిద్ధమవుతున్నారు. భారీ ఎత్తున కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా నిధుల సమీకరణ చేస్తున్నారు. తాజాగా రిలయన్స్‌ ఇన్‌ఫ్రాలోకి రూ. 550 కోట్ల నిధులు అనిల్‌ తెచ్చారు. 

ప్రమోటర్ల నుంచి
ప్రమోటర్లకు వాటాలు విక్రయించడం ద్వారా రూ, 550.56 కోట్లు నిధులు సమీకరించేందుకు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా బోర్డు ఆమోదం తెలిపింది. ప్రిఫెరెన్షియల్‌ ఎలాట్‌మెంట్‌ ద్వారా 8.88 కోట్ల షేర్లను ప్రమోటర్లుగా ఉన్న వీహెచ్‌ఎస్‌ఐ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి ఇవ్వనుంది.

దీర్ఘకాలిక పెట్టుబడులు
ప్రస్తుతం రిలయన్స్‌ ఇన్‌ఫ్రా దీర్ఘకాలిక ప్రాజెక్టులపై దృష్టి సారించింది. జాతీయ రహదారులు, పవర్‌ ప్రాజెక్టులు, మెట్రో రైల్‌ నిర్మాణ పనులపై దృష్టి పెట్టింది. ఈ పనుల్లో ఎక్కువ శాతం బీవోటీ పద్దతిలోనే రిలయన్స్‌ ఇన్‌ఫ్రా చేపడుతోంది. 

చదవండి : Vijaya Diagnostic: పబ్లిక్‌ ఇష్యూకి సిద్ధం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top