మరోసారి అభిమానులను ఫిదా చేసిన ఆనంద్‌ మహీంద్ర

Anand Mahindra shares most beautiful villages in India - Sakshi

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి తన అభిమానులను ఫిదా చేశారు. పచ్చని పకృతి, పల్లె అందాలకు మురిసిపోతూ ట్విటర్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. భారతదేశంలోని 10 అత్యంత అందమైన గ్రామాల లిస్ట్‌ను షేర్‌ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కల్పా నుండి మేఘాలయలోని మావ్లిన్నాంగ్ వరకు  ఉన్న ఫోటోలు మిమ్మల్ని ఆనంద పరవశంలో  ముంచేస్తాయి.

దేశంలో పలు ప్రాంతాల శోభను ప్రతిబింబించేలా దేశం నలుమూలలా పరుచుకున్న ప్రకృతి మాత ఒడిలో,  ఎనలేని సోయగంతో అలరారే అద్భుత అందాలను చూసి తరించాలని అందరికీ ఉంటుంది. రోజువారీ రొటీన్‌ లైఫ్‌ నుంచి సేదదీరేందుకు సాధారణంగా  పల్లెలకు పరుగులు తీస్తాం. అక్కడి అందాలను ఆత్మీయతలను జీవిత మంతా పదిలపర్చుకుంటాం. కానీ ఈ విశాల ప్రపంచంలో ప్రతీ మూలలోని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం అందరికీ సాధ్యం  కాకపోవచ్చు. 

(బుగట్టి రెసిడెన్షియల్‌ టవర్‌...నెక్ట్స్‌ లెవల్‌: దిమ్మదిరిగే ఫోటోలు)

అలాంటి వారికి భారీ ఊరటనిచ్చేలా దేశంలోని అందమైన టాప్‌ టెన్‌ పల్లెల అద్భుతమైన ఫోటోలను కలర్స్ ఆఫ్ భారత్ పేరుతో   ఉన్న ట్విటర్‌ హ్యాండిల్‌ పోస్ట్‌ చేసింది. వీటిని చూసిన ఫిదా అయిన ఆనంద్‌ మహీంద్ర వాటిని  రీట్వీట్‌ చేశారు.  మండు వేసవిలో చల్లని చిరుజల్లుల్లా ఉన్న ఫోటోలనుచూసి ఆయన మురిసిపోయారు. మన చుట్టూ ఉన్న అందాలు చూసి తనకు మాటలు రావడం లేదంటూ పరశించిపోయారు.  భారతలో తాను ఆస్వాదించాల్సిన  అందమైన  ప్రాంతాల లిస్ట్ పెరిగిపోతోంది అంటూ కమెంట్‌ చేశారు.   (1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top