వాటాను విక్రయించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈవో

Aditya Puri sells shares worth Rs 843 crore in HDFC Bank - Sakshi

3.50శాతం నష్టపోయిన షేరు

దేశీయ అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో ఆదిత్య పురి ఇదే బ్యాంకులో కొంత మొత్తంలో తన వాటాను విక్రయించారు. ఆదిత్య ఈ జూలై 21-24 తేదిల మధ్య 74.2లక్షల ఈక్విటీ షేర్లను రూ.843 కోట్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆదిత్య గతకొన్నేళ్లుగా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్‌(ఈఎస్‌ఓపీ)ద్వారా దాదాపు 78లక్షల షేర్లను దక్కించుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020లో ఈఎస్ఓపీ ద్వారా 6.82 లక్షల ఈక్విటీ షేర్లను పొందారు. గత ఆర్థిక సంవత్సరం 2019-20లో స్టాక్‌ ఆప్షన్లను మినహాయించి ఆదిత్య రూ.18.92 కోట్ల జీతాభత్యాన్ని అందుకున్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును 1994లో స్థాపించారు. నాటి నుంచి ఆదిత్యపురి బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో పనిచేస్తారు. ఏడాది అక్టోబర్‌ 20తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్‌లో తదుపరి సీఈవో ఎంపిక కోసం బ్యాంకు బోర్డు సెలక‌్షన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటిలో 6గురు సభ్యులున్నారు. ఈ పదవిలో రేసులో శశిధర్‌ జగ్‌దీషన్‌, కైజద్‌ బరుచా, సునీల్‌ గార్గ్‌ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ బ్యాంక్‌ షేరు 3.50శాతం క్రాష్‌: 
బ్యాంక్‌ సీఈవో వాటా విక్రయంతో నేడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు సోమవారం 3.50శాతం నష్టాన్ని చవిచూసి రూ.1079.30 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మిడ్‌సెషన్‌ కల్లా 3.22శాతం నష్టంతో రూ.1082.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.738.90, రూ.1304.10గా ఉన్నాయి. ఈ మార్చి 24లో రూ.765 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. నాటి నుంచి ఏకంగా నేటి వరకు 46శాతం రికవరిని సాధించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top