గీత కుదిరితేనే రాత ! | - | Sakshi
Sakshi News home page

గీత కుదిరితేనే రాత !

May 18 2026 12:12 AM | Updated on May 18 2026 12:12 AM

● మారిన బోధనా స్వరూపంతో సమస్యలు ● పరీక్షల ఫలితాలపైనా ప్రభావం ● సెలవుల్లో చేతిరాత సాధన చేస్తేనే ప్రయోజనం

● మారిన బోధనా స్వరూపంతో సమస్యలు ● పరీక్షల ఫలితాలపైనా ప్రభావం ● సెలవుల్లో చేతిరాత సాధన చేస్తేనే ప్రయోజనం

మనస్తత్వానికి అద్ధం

మార్కుల కోసమే చేతిరాత అనే అపోహ చాలా మంది లో ఉంది. కానీ అక్షరాలు మన మనస్తత్వాన్ని తెలుపుతాయి. అందమైన చేతిరాత ఉన్న వారు నలుగురిలో ఆత్మవిశ్వాసంగా మెలుగుతారు. బాగా రాసే విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకుంటారు. అక్షరాలు బాగా రాయలేని చిన్నారులు.. అందరి ముందు తమ చేతిరాతను ప్రదర్శించాల్సి వస్తే ఒత్తిడికి లోనవుతారు.

తెలుగులో సాధన ఇలా..

తెలుగు చేతిరాత మెరుగుపడటానికి ఒక పెద్ద వృత్తం, ఒక చిన్న వృత్తం ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు రాయడం సాధన చేయాలి. మరీ పెద్దగా, చిన్నగా కాకుండా అక్షరాలు ముత్యాల్లా గుండ్రంగా కనిపించేలా రాసే ప్రయత్నం చేయాలి. మొదట చిన్న పదాలు, ఆతర్వాత వ్యాసాలు, అనంతరం కథలను పదాల మధ్య ఖాళీలతో రాయాలి. అక్షరాల ఆకారం, పరిమాణం, తలకట్లు, దీర్ఘాలపై శ్రద్ధ వహిస్తూ ముందుకెళ్తే చేతిరాత మెరుగుపడుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

పెన్ను పట్టడమూ కీలకమే

విద్యార్థుల్లో చేతి కదలిక నైపుణ్యాలు సరిగా లేకపోతే అక్షరం వంకర్లు తిరుగుతోంది. దీన్ని అఽధిగమించేందుకు మొదట పెన్సిల్‌, పెన్ను మూడు వేళ్లతో పట్టుకోవాలి. చూపుడు వేలు పైకి ఉండేలా పట్టి రాయాలి. ఆ సమయాన పెన్సిల్‌, పెన్ను వెనక భాగం భుజం వైపు చూసేలా జాగ్రత్త తీసుకుంటేనే అక్షరం కంటికి ఇంపుగా వస్తుంది

ఆంగ్లంలో..

ఆంగ్లం చేతి రాత నిలువుగా ఉండా లి. అక్షరాలు, పదా ల మధ్య ఒకే దూరాన్ని పాటించాలి. కలిపిరాత అయితే కుడిపక్కకు కొంచెం వంచి రాయా లి. ఇంగ్లిష్‌లో అన్ని అక్షరాలు ఒకే ఎత్తులో ఉండనందున మధ్య, పైభాగం, కింది భాగంలో ఉండే అక్షరాలు సరైన పరిమాణంలో రాయగలగాలి. దీనికోసం తొలుత ఫోర్‌రూల్‌, ఆ తర్వాత డబుల్‌, సింగిల్‌, చివరగా తెల్లకాగితాలపై సాధన చేయాలి. చిన్న అక్షరాలను మొదటగా రెండు, తర్వాత మూడు, అనంతరం ఒక్కొక్కటి కలిపి రాసేలా సాధన చేయాలి. రాత అందంగా ఉండేలా ప్రతీ అక్షరాన్ని కోణం మార్చి రాసేలా ప్రయత్నించాలి.

Advertisement
 
Advertisement
Advertisement