ఇల్లెందు: మద్యం వ్యాపారుల మధ్య విభేదాలు పొడసూపి పోలీస్ స్టేషన్ వరకు చేరాయి. ఇల్లెందులో వ్యాపారి గణేష్‌తోపాటు పంబాల సబిత, గోవిందరావు, బి. శ్రీనివాసరావు, చల్లా రామారావు, అర్వపల్లి లక్ష్మీనారాయణ, లగ్గల పురుషోత్తం, పెరుమాళ్ల సరిత, కందుల బేబీ ప్రసన్న, దారా ఉమామహేశ్వరరావు, రామగిరి షణ్ముఖరాజు, ఏపూరి స్రవంతి భాగస్వాములుగా కొన్ని మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. రూ. 70 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు భాగస్వాములు చెబుతున్నారు. అయితే గణేష్ షాపుల ద్వారా వచ్చే ఆదాయం లెక్కలు తమకు చూపడం లేదని పేర్కొంటూ ఆదివారం భాగస్వాములు మద్యం షాపులకు తాళాలు వేశారు. తమకు న్యాయం చేయాలని సోమవారం ఇల్లెందు సీఐ తాటిపాములు సురేష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దుకాణాలు మూసివేయడంతో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. కాగా, ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఐ టి. సురేష్, ఎకై ్సజ్ సీఐ రాంప్రసాద్ వేర్వేరుగా తెలిపారు.
పోలీస్ స్టేషన్‌కు చేరిన
పంచాయితీ


