పెద్దమ్మతల్లికి విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మతల్లికి విశేష పూజలు

Mar 30 2026 8:32 AM | Updated on Mar 30 2026 8:32 AM

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయప్రాంగ ణం కిటకిటలాడింది. క్యూలైన్‌ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు అమ్మవారికి విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నా రు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్‌.రజనీకుమారి, ఆలయ పాలకవర్గం, వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు.

నేడు ప్రజావాణి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): సమస్యల పరి ష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో ఉద యం 10.30 గంటలకు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలను లిఖితపూర్వకంగా అందజేయాలని సూచించారు.

నేడు గిరిజన దర్బార్‌

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్‌ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్‌ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పీఓ పేర్కొన్నారు.

గోదావరిపై వారధి!

అశ్వాపురం: మండల పరిధిలోని కుమ్మరిగూడెం వద్ద గోదావరి నదిపై ఉన్న దుమ్ముగూడెం ఆనకట్ట అశ్వాపురం–దుమ్ముగూడెం మండలాలకు వారధిలా పనిచేస్తోంది. గోదావరి నీటిమట్టం తగ్గడంతో ఆనకట్టపైనుంచి ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. పర్యాటకులూ సందర్శిస్తున్నారు. ఆనకట్ట వేసవిలో వారధిలా, శీతాకాలంలో జలపాతంలా, వర్షాకాలంలో నీరు ఉప్పొంగుతూ.. కాలానికో అందంతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

కిన్నెరసానిలో

పర్యాటక సందడి

పాల్వంచరూరల్‌: మండల పరిధిలోని కిన్నెరసానిలో ఆదివారం పర్యాటక సందడి నెలకొంది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యా మ్‌, జలాశయం, డీర్‌ పార్కులోని దుప్పులను వీక్షించారు. 265 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా, వైల్డ్‌లైఫ్‌ శాఖకు రూ. 15,635 ఆదాయం లభించింది. 210 మంది బోటు షికారు చేయగా, టూరిజం కార్పొరేషన్‌ సంస్థకు రూ.12,860 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ముగిసిన ఇంటర్‌ మూల్యాంకనం

ఖమ్మం సహకారనగర్‌: ఇంటర్మీడియట్‌ జవాబు పత్రాల మూల్యాంకనం(స్పాట్‌ వాల్యూయేషన్‌) ఆదివారంతో ముగిసింది. ఖమ్మంలోని నయా బజార్‌ జూనియర్‌ కళాశాలలో క్యాంప్‌ ఏర్పాటుచేయగా క్యాంప్‌ ఆఫీసర్‌గా జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి కె.రవిబాబు వ్యవహరించా రు. రాష్ట్రంలోని వివిధజిల్లాలకు చెందిన 3,14,501 జవాబుపత్రాలు పంపించారు. ఈ నెల 4వ తేదీన మొదలైన ముల్యాంకనంలో 1,220మంది అధ్యాపకులు పాల్గొనగా ఆదివా రం ముగిసిందని డీఐఈఓ రవిబాబు తెలిపా రు. అయితే, ఏప్రిల్‌ 2వ తేదీ వరకు రీకౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement