దుకాణాలకు సరఫరా చేస్తున్నాం
● రేషన్ దుకాణాలకు సన్నబియ్యం తరలింపు ● జిల్లాలో 17,282 టన్నుల బియ్యం పంపిణీకి సిద్ధం
పాల్వంచరూరల్: వేసవికాలంలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం మూడు (ఏప్రిల్, మే, జూన్) నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. జిల్లాలో మొత్తం 443 రేషన్ దుకాణాలు ఉండగా, ప్రతి నెలా ఆయా రేషన్‌షాపులకు 5,500 టన్నుల సన్న బియ్యాన్ని పౌరసరఫరాల కార్పొరేషన్ అధికారులు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఏప్రిల్ 1 నుంచి రేషన్‌కార్డుదారులకు ఒకేసారి మూడునెలల రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే అధికా రులు సివిల్ సప్లాయీస్ గోదాములనుంచి రేషన్ దుకాణాలకు బియ్యాన్ని తరలిస్తున్నారు. రేషన్ దుకాణాలు బియ్యం బస్తాల నిల్వలతో నిండిపోతున్నాయి. కొన్ని రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వ లకు తోడు మార్చిలో మిగిలిన బియ్యం నిల్వలు, మూడు నెలల రేషన్‌తో భారీగా నిల్వలు పేరుకుపోయినట్లు డీలర్లు తెలిపారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కేజీల బియ్యం పంపిణీ చేయనుండగా, ఈసారి 18 కేజీల సన్నబియ్యం అందించనున్నారు.
మూడు నెలల రేషన్ బియ్యాన్ని జిల్లాలోని అన్ని రేషన్ షాపులకు తరలిస్తున్నాం. 17,282 టన్నుల బియ్యాన్ని నిర్దేశిత రేషన్‌షాపులకు అందిస్తున్నాం. ప్రతినెలా మాదిరిగా పంపిణీ జరుగుతుంది. గడువు పొడిగింపుపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదు. –త్రినాథ్‌బాబు,
జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ డీఎం


