శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ, పునర్జీవం పనులతోపాటు వచ్చే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రూ.351 కోట్లతో చేపట్టబోయే వేర్వేరు పనులకు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఆలయంలో ఈశాన్య మూలలో ఏర్పాటు చేసిన బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులతో కలిసి గ్రూప్ ఫొటోకు ఫోజు ఇచ్చే సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఫ్రేమ్‌లో కనిపించకుండా వెనకబడిపోయారు. దీంతో సీఎం కల్పించుకుని ‘ తెల్లం ముందుకురా అంటూ’ పిలిచారు. కాగా, ప్రభుత్వ ం కేటాయించిన రూ. 351 కోట్ల నిధుల్లో.. రూ.75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ధి, రూ.180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, రూ.96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.


