సూపర్‌బజార్(కొత్తగూడెం)/భద్రాచలంఅర్బన్: శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భద్రాచలం పర్యటన నేపథ్యంలో ప్రత్యేక బృందాలతో పటిష్టమైన నిఘా ఏర్పాట్లను చేసినట్లు పేర్కొన్నారు. రెండు వేల మంది పోలీసులతో పాటు ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ భక్తులకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. కాగా, డీజీపీ శివధర్‌రెడ్డి శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం రాగా ఎస్పీ రోహిత్‌రాజు స్వాగతం పలి కారు. ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసుల నుంచి డీజీపీ గౌరవవందనం స్వీకరించారు.


