పెద్దమ్మతల్లికి లక్ష కుసుమార్చన | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మతల్లికి లక్ష కుసుమార్చన

Mar 26 2026 7:42 AM | Updated on Mar 26 2026 7:42 AM

పాల్వంచరూరల్‌: శ్రీదేవి వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పెద్దమ్మతల్లి (శ్రీకనకదుర్గ) అమ్మవారికి అర్చకులు మల్లెపూలతో లక్ష కుసుమార్చన పూజలు చేశారు. బుధవారం రుద్రాభిషేకం, సూక్త పారాయణం , చండీసప్తసతీ పారాయణం, హారతి, మంత్రపుష్పం తదితర పూజలను నిర్వహించారు.

28న లోక్‌ అదాలత్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఈ నెల 28న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్‌ వసంత్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు తమ పెండింగ్‌ కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు లోక్‌ అదాలత్‌ అద్భుత అవకాశమని పేర్కొన్నారు.

నేడు ‘బార్‌’ ఎన్నికలు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కొత్తగూడెం బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు గురువారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల ప్రధాన అధికారిగా పలివెల గణేష్‌బాబు, సహాయ ఎన్నికల అధికారులుగా అరకల కరుణాకర్‌, పీ వేణువాసరావులు వ్యవహరిస్తున్నారు. మొత్తం ఓటర్లు 331 మంది ఉన్నారు. అధ్యక్ష పదవికి ఇద్దరు, ప్రధాన కార్యదర్శికి ముగ్గురితో పాటు మరికొన్ని పదవులకు పోటీ నెలకొంది. మహిళా ప్రతినిధిగా మల్లెల ఉషారాణి ఏకగ్రీవమయ్యారు.

జాతీయస్థాయిలో మహిళా కానిస్టేబుల్‌ ప్రతిభ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): పంజాబ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో జిల్లా ఏఆర్‌ విభాగం మహిళా కానిస్టేబుల్‌ డి.సుష్మ ప్రతిభ కనబరిచింది. తొలుత సైబరాబాద్‌ కమిషనరేట్‌ వేదికగా నిర్వహించిన రాష్ట్ర 4వ పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో ఆమె 100, 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాలు సాధించింది. ఆపై జాతీయ స్థాయికి ఎంపిక కాగా అక్కడ ఐదో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా సుష్మను ఎస్పీ రోహిత్‌రాజు బుధవారం కొత్తగూడెంలో అభినందించారు. ఏఆర్‌ డీఎస్పీ సత్యనారాయణ, ఆర్‌ఐ లాల్‌బాబు పాల్గొన్నారు.

భక్తులకు అసౌకర్యం

కలగకుండా ఏర్పాట్లు

కొత్తగూడెంఅర్బన్‌: శ్రీసీతారాముల కల్యాణం నేపథ్యంలో భద్రాచలం రోడ్డు రైల్వేస్టేషన్‌కు వచ్చి వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే డీఆర్‌ఎం ఆర్‌.గోపాలకృష్ణన్‌ సూచించారు. బుధవారం ఆయన కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో తనిఖీ చేశారు. అమృత్‌ పథకంలో భాగంగా జరుగుతున్న పనుల తీరును పరిశీలించారు. భక్తులకు తాగునీరు, వెయిటింగ్‌ హాల్‌ సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా తిరుపతి, షిర్డీకి రైళ్ల ఏర్పాటు, మణుగూరు నుంచి డోర్నకల్‌ ప్యాసింజర్‌, బెల్గావి ఎక్స్‌్‌ప్రెస్‌ రైళ్ల పునరుద్ధరణ, రైల్వేస్టేషన్‌లో వసతుల కల్పనపై డీఆర్‌యూసీసీ మెంబర్‌ వై.శ్రీనివాస్‌రెడ్డి, గాంఽధీపథం జిల్లా కన్వీనర్‌ చింతలచెర్వు గెర్షోము తదితరులు డీఆర్‌ఎంకు వినతిపత్రం అందజేశారు. రైల్వే ఏఆర్‌ఎం సిపాలి, ఏరియా ఆఫీసర్‌ రాజేంద్రప్రసాద్‌, ఏరియా ఇన్‌స్పెక్టర్‌ పాషా, స్టేషన్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌, కృష్ణ, సాయి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement