నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం వినతి
మణుగూరు రూరల్: పినపాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఈమేరకు మంగళవారం హైదరాబాద్‌లో సీఎంకు వినతిపత్రం అందజేశాక ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య, గ్రామాలు, పట్టణాల్లో డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం, పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. అలాగే, ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలల్లో మౌలిక వసతులకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.
ఆదర్శ కేంద్రాలుగా నిలవాలి
కలెక్టర్ అంకిత్
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు ప్రజలకు నాణ్యమైన సేవలందించే ఆదర్శ కేంద్రాలుగా నిలవాలని కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో మంగళవారం పర్యటించిన ఆయన ఎర్రగుంటని పీహెచ్‌సీని తనిఖీ చేశారు. పలువురు సిబ్బంది యూనిఫాం(ఆఫ్రాన్) ధరించకపోవడంపై అసహనం వ్యకం చేసిన కలెక్టర్ కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు. అలాగే, పలువురు డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నందున విచారణ చేపట్టాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. అనంతరం కేబీజీవీని పరిశీ లించిన కలెక్టర్.. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ, భోజనంపై మెనూలో అమలుపై ఆరా తీయడమే కాక భోజనం రుచి చూశారు. ఎంపీడీఓ మహాలక్ష్మి, ఎంపీఓ షబ్నా, వైద్యాధికారి ప్రియాంక, హెచ్‌ఎం శారద, అధికారులు పాల్గొన్నారు.


