ఘనంగా ధ్వజపట లేఖనం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ధ్వజపట లేఖనం

Mar 25 2026 7:13 AM | Updated on Mar 25 2026 7:13 AM

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం ధ్వజపట లేఖనం ఘనంగా జరిగింది. శ్రీరామనవమి వసంత పక్ష ప్రయుక్త బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడాధివాసం, ధ్వజపట లేఖనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ప్రధాన సంకేతమైన గరుత్మంతుడి బొమ్మతో ధ్వజపట లేఖనంను అర్చకులు జీయర్‌ మఠంలో పూర్తి చేశారు. ఆపై త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌స్వామి భక్తులకు ప్రవచనం అందజేశారు. ఇక బుధవారం అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, చతుఃస్థానార్చనం జరపడమే కాక సంతాన ప్రాప్తి కోసం వచ్చే మహిళలకు గరుడ ప్రసాదాన్ని అందజేస్తారు.

నేడు రామాలయంలో

‘ధ్వజారోహణం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement