7.4 కిలోల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

7.4 కిలోల గంజాయి పట్టివేత

Mar 24 2026 7:54 AM | Updated on Mar 24 2026 7:54 AM

భద్రాచలంటౌన్‌: భద్రాచలం పట్టణంలో ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్‌ఐ చావా శ్రీహరిరావు బృందం సోమవారం వాహనాల తనిఖీ చేపట్టగా, నంబర్‌ లేని ఓ ద్విచక్ర వాహనదారుల వద్ద 7.4 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. నిందితులు బొడ్డు చందు, కూరాకుల రోహిత్‌ను అరెస్ట్‌చేసి, వారి నుంచి గంజాయితో పాటు బైక్‌, రెండు సెల్‌ఫోన్లను సీజ్‌చేశారు. వీటి విలువ సుమారు రూ.4.90లక్షలు ఉంటుందని, ఒడిశాలోని కలిమెల నుంచి సిద్దిపేట జిల్లా చేర్యాలకు గంజాయిని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని ఎస్‌ఐ తెలిపారు. ఈదాడుల్లో ఎక్సైజ్‌ సిబ్బంది సుధీర్‌, వెంకట్‌, హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

భర్త హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్టు

చండ్రుగొండ: మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో ఈనెల 11న మృతిచెందిన తాపీమేసీ్త్ర ఎస్‌కే జాఫర్‌ కేసు మిస్టరీ వీడింది. భార్య ఖతిజా, ఆమె ప్రియుడు షేక్‌ మీరాసాహెబ్‌ కలిసి హతమార్చిన ట్లు పోలీసులు నిర్ధారించా రు. ఈ మేరకు సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ఎస్‌ఐ శివరామ కృష్ణ వివరాలు వెల్లడించారు. ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన ఖతీజాకు తిప్పనపల్లికి చెందిన జాఫర్‌తో 13ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పదేళ్ల పాటు కాపురం సజా వుగా సాగింది. ఆ తర్వాత జీవనోపాధి నిమిత్తం చింతలపూడి వెళ్లారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మీరాసాహెబ్‌తో ఖతిజాకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అనుమానం వచ్చిన జాఫర్‌ భార్యాపిల్లలతో తిరిగి తిప్పనపల్లికి వచ్చినా.. వారి మధ్య ఫోన్‌ సంభాషణ, వివాహేతర సంబంధం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా ఖతిజా మీరాసాహెబ్‌తో కలిసి భర్తను హతమార్చగా, సహజ మరణంగా భావించిన కుటుంబసభ్యులు ఈనెల 12న మృతదేహాన్ని ఖననంచేశారు. ఆరోజు రాత్రి మృతుడి కూతరు కుటుంబీకులకు అసలు విషయం చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు శవ పరీక్ష చేశారు. కేసు విచారణ అనంతరం నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement