విప్లవవీరుల ఆశయాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

విప్లవవీరుల ఆశయాలు సాధించాలి

Mar 24 2026 7:54 AM | Updated on Mar 24 2026 7:54 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌ పాషా

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): సమసమాజ స్థాపనకు అమరులైన విప్లవ వీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాల ని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌ పాషా పిలుపునిచ్చారు. స్థానిక శేషగిరి భవన్‌లో సర్దా ర్‌ భగత్‌సింగ్‌,రాజ్‌గురు,సుఖ్‌దేవ్‌ల 95వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. వారిచిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాబీర్‌ పాషా మా ట్లాడుతూ.. బ్రిటీష్‌ నిరంకుశ పాలకులను ఎదిరించి పోరాడి, అతి చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన వారి ధైర్యసాహసాలను యువతకు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అమరవీరు ల ఆశయ సాధనకు నిరంతరం పోరాడడమే వారికిచ్చే నిజమైన నివాళి అన్నారు. నేటి పాలకులు కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తూ దేశ సంపదను దోచిపెడుతున్నారని, దీనికి వ్యతిరేకంగా విప్లవవీరుల స్ఫూర్తితో పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నా యకులు నరాటిప్రసాద్‌, కంచర్ల జమలయ్య, దేవరకొండ శంకర్‌, వంగా వెంకట్‌, నగేష్‌, శ్రీని వాస్‌, మల్లికార్జున్‌, మణి, మాతంగి లింగయ్య, లక్ష్మీనారాయణ,రాములు,రాజుపాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement