ఆరు కిలోమీటర్లు నడిచి.. వాచ్‌ టవర్‌ చేరుకుని | - | Sakshi
Sakshi News home page

ఆరు కిలోమీటర్లు నడిచి.. వాచ్‌ టవర్‌ చేరుకుని

Mar 23 2026 8:28 AM | Updated on Mar 23 2026 8:28 AM

పాల్వంచరూరల్‌: కిన్నెరసాని అటవీ ప్రాంతంలో సఫారీ వాహనం తిరిగే రూట్‌ను పరిశీలించేందుకు అటవీశాఖ అధికారులు నడిచివెళ్లారు. ఈ మేరకు ఆదివారం డీఎఫ్‌ఓ కృష్ణాగౌడ్‌ వివరాలు వెల్లడించారు. పర్యాటకుల కోసం త్వరలో అభయారణ్యంలో సఫారీ వాహనం ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వరల్డ్‌ ఫారెస్ట్‌ డేని పురస్కరించుకుని డీఎఫ్‌ఓ జి.కృష్ణాగౌడ్‌, జిల్లాలోని ఎఫ్‌డీఓలు కట్టా దామోదర్‌రెడ్డి, బి.బాబు, సుజాత, కోటేశ్వరరావు, రేంజర్లు, ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బీఓలు సుమారు 100 మంది వరకు ఆరు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లారు. అద్దాలమేడ, కాటేజీల మీదుగా మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి గుట్టపైన నిర్మించిన వాచ్‌ టవర్‌కు చేరుకుని పరిశీలించారు. అక్కడ నుంచి తిరిగి మరో మూడు కిలోమీటర్లు నడిచి డీర్‌పార్కు వద్ద చేరుకున్నారు. అటవీశాఖ సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపటినట్లు డీఎఫ్‌ఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement