ఇసుక ట్రాకర్లు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాకర్లు సీజ్‌

Mar 22 2026 1:52 AM | Updated on Mar 22 2026 1:52 AM

అశ్వాపురం: మండల పరిధిలోని అమ్మగారిపల్లి గ్రామంలో గోదావరి నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు శనివారం పట్టుకున్నా రు. వాహనాలను స్టేషన్‌ కు తరలించారు. ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.

రెండు ఇసుక లారీలు స్వాధీనం

పాల్వంచ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. శనివారం చర్ల నుంచి ఖమ్మానికి రెండు లారీల్లో ఇసుక తరలిస్తుండగా పాల్వంచ బీసీఎం రోడ్‌లో ఎస్‌ఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. అనంతరం లారీలను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

బండరాయి రోడ్డుపై పడటంతో మరో కారు ఢీకొని డ్రైవర్‌కు గాయాలు

డివైడర్‌ను ఢీకొన్న గ్రానైట్‌ లారీ

పాల్వంచరూరల్‌: గ్రానైట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ డివైడర్‌ను ఢీకొనడంతో లారీలో ఉన్న బండరాయి రోడ్డుపై పడి ట్రాఫిక్‌ కు అంతరాయం కలిగింది. అదే సమయంలో వస్తున్న కారు రాయిని ఢీకొనగా, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం తెల్ల వారుజామున జగన్నాథపురంలో జరిగింది. ఒడిశా నుంచి భారీ గ్రానైట్‌ బండరాయితో వస్తున్న లారీ మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామం వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీలో ఉన్న బండరాయి రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. లారీ డ్రైవర్‌ వాహనాన్ని వదిలేసి పారిపోయాడు. అదే సమయంలో పాల్వంచవైపు వస్తున్న కారు బండరాయిని ఢీకొనడంతో కారు ముందుభాగం దెబ్బతిన్నది. కారుడ్రైవర్‌, ముసలిమడుగుకు చెందిన పొడియం సుభాష్‌ చంద్రబోస్‌కు స్వల్పగాయాలైనట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు. భారీ క్రేన్‌ తెప్పించి బండరాయిని రోడ్డు మీద నుంచి పక్కకు తొలగించినట్లు పేర్కొన్నారు.

జాతరలో చోరీ

అశ్వారావుపేటరూరల్‌: మండలంలోని వినాయకపురం వద్దగల శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ తల్లి జాతరలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చేతివాటం ప్రదర్శించారు. గాడ్రాల గ్రామానికి చెందిన కుండా ఝాన్సీలక్ష్మి సరోజిని బాయి, భర్త వెంకన్నబాబుతో కలిసి జాతరకు వెళ్లగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆమె చేతులో ఉన్న పర్సును అపహరించారు. దీంతో పర్సులో ఉన్న రూ.1,50,000 విలువైన 20 గ్రాముల బంగారు నల్లపూసల గొలుసు, రూ.10వేల విలువైన సెల్‌ఫోన్‌, రూ.500 నగదు చోరీకి గురైనట్లు బాధితురాలు శనివారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement