మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం | - | Sakshi
Sakshi News home page

మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం

Mar 22 2026 1:52 AM | Updated on Mar 22 2026 1:52 AM

భద్రాచలంఅర్బన్‌: గోదావరిలో గల్లంతైన మరో ఇద్దరి మృతదేహా లు శనివారం లభ్యమయ్యాయి. భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దర్శనానికి వచ్చి శుక్రవారం గోదా వరి నదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతుకాగా, ముగ్గురు విద్యార్థులు అభిరామ్‌, శ్రీకర్‌, నవదీప్‌ల మృతదేహాలు లభ్యమైన విషయం విదితమే. గజ ఈతగాళ్లు శనివారం కూడా గాలింపు చేపట్టగా గల్లంతైన తేజజ్ఞ, సతీష్‌ల మృతదేహాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏలూరు జిల్లా కుక్కునూరు మండల పరిధిలో లభ్యమయ్యాయి. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించే అవకాశం లేకపోవడంతో కుక్కునూరు మండల పరిధిలోని గోదావరి ఒడ్డునే వీరికి భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించా రు. కాగా శుక్రవారం లభ్యమైన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను రోడ్డు మార్గంలో తరలించే అవకాశం లేకపోవడం, సుమారు 2కిలోమీటర్లు మేర గోదావరి ఇసుకలో ప్రయాణించాల్సి ఉండటంతో అధికా రులు ఎడ్లబండిపై తరలించారు. శని వారం లభ్యమైన రెండు మృతదేహాలు దాదాపు 24 గంటలపాటు నీటిలో ఉండటంతో అవి పాడైపోయిన స్థితికి చేరగా, గోదావరి ఒడ్డునే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.

వెయ్యి బాతుల మృత్యువాత

దమ్మపేట: ఆగి ఉన్న బొలెరో ట్రక్కును లారీ ఢీకొని బాతులు మృత్యువాత పడిన ఘటన మండలంలోని ముష్టిబండ శివారులో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీప తాడువాయి గ్రామం నుంచి ఏపీలోని ఏలూరు జిల్లా తిరువూరుకు 3వేల బాతులతో బొలెరో ట్రక్కు వాహనం బయలుదేరింది. ఈ క్రమంలో వాహనాన్ని మండలంలోని ముష్టిబండ శివారు దాబా హోటల్‌ సమీపంలో నిలిపారు. అదే సమయంలో మందలపల్లి నుంచి సత్తుపల్లి వైపు మొక్కజొన్నల లోడుతో వెళ్తున్న లారీ బొలెరోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల్లో ఉన్నవారికి స్పల్ప గాయాలయ్యాయి. రెండు వాహనాలు పాక్షికంగా ధ్వంసం కాగా, బొలెరోల ఉన్న వేయికి పైగా బాతులు మృత్యువాత పడ్డాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement