●ప్రభుత్వ ఆస్పత్రిపై నమ్మకం పెంచేలా ఫార్మసిస్ట్ నిర్ణయం
ఇల్లెందు: ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచేలా ఇల్లెందు ఏరియా ఆస్పత్రి ఫార్మసిస్ట్ రజిని తీసుకున్న నిర్ణయం అందరి మన్ననలు పొందింది. ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న రజిని గర్భిణి కాగా, శనివారం ఆమెకు పురిటినొప్పులు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు కాకుండా ఏరియా ఆస్పత్రికే వచ్చింది. గైనకాలజిస్టులు సింధు, దేవీ నాగప్రియాంకతో పాటు ఇతర విభాగాల వైద్యులు శ్రీనివాస్, మాధురి, బావుసింగ్, సిబ్బంది ఆమెకు శస్త్రచికిత్స చేయగా ఆడశిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండగా, పనిచేస్తున్న ఆస్పత్రిపై నమ్మకం పెంచేలా రజిని తీసుకున్న నిర్ణయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ హర్షవర్ధన్, డీసీహెచ్‌ఎస్ రవిబాబు అభినందించారు.


