పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరగనున్న శ్రీదేవీ వసంత నవరాత్రి మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఈ వేడుకలు నిర్వహించనుండగా వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కలశ స్థాపన పూజ చేశారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యావాచనం, పంచగవ్య ప్రాసన, రుత్విక్కరణ, దీక్షావస్త్ర ధారణ, అఖండ దీపారాధన, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష కుసుమార్చన తదితర పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ఈఓ రజనీకుమారి, రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, ఎస్‌కె.సాబీర్‌పాషా, ముత్యాల విశ్వనాధం, ధర్మకర్తలు చీకటి కార్తీక్, బి.గిరిప్రసాద్, పెండ్లి రాంరెడ్డి, చందుపట్ల రమ్య, చెవుగాని పాపారావు, సీహెచ్.శేఖర్‌బాబు, దుగ్గిరాల సుధాకర్, అడుసుమల్లి సాయిబాబు, శనిగారపు శ్రీనివాసరావు, మూర్తి రవికుమార్, ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


