అత్యధికం హస్తగతం
సగానికి పైగా పంచాయతీల్లో పార్టీ మద్దతుదారుల విజయం
ఆ తర్వాత స్థానంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు
కొత్తగూడెంలో సత్తాచాటిన సీపీఐ
చుంచుపల్లి : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఘట్టం ఆదివారం ముగియగా.. ఈ దశలోనూ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు సత్తా చాటారు. రెండో స్థానంలో బీఆర్‌ఎస్ మద్దతుదారులు నిలవగా, సీపీఐ మూడో స్థానం దక్కించుకుంది. జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చుండ్రుగొండ, చుంచుపల్లి, ములకలపల్లి, పాల్వంచ, దమ్మపేట మండలాల పరిధిలోని 156 స్థానాలకు గాను 16 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. ములకలపల్లి మండలం చాపరాలపల్లిలో కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలు జరగకపోగా, పాల్వంచ పాండురంగాపురంలో ఎస్టీ రిజర్వ్‌డ్ అభ్యర్థి లేక ఎవరూ నామినేషన్ వేయలేదు. మిగిలిన 138 గ్రామపంచాయతీలు, 1,123 వార్డులకు ఆదివారం పోలింగ్ నిర్వహించారు. ఇందుకోసం 386 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2,820 వార్డు సభ్యులు బరిలో నిలిచారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధికంగా 80 సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకున్నారు. బీఆర్‌ఎస్ బలపర్చిన వారు 31, సీపీఐ మద్దతుదారులు 21, సీపీఎం మద్దతుదారులు ఐదుగురు, ఇతరులు 17 చోట్ల విజయం సాధించారు. మొదటి, రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు స్పష్టమైన అధిక్యం కనబరిచారు. జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల పరిధిలోని గ్రామపంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ స్థానాలు కై వసం చేసుకునేలా కృషి చేస్తున్నారు. అటు బీఆర్‌ఎస్ సైతం పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాలోని పలు పంచాయతీల్లో అధికార పార్టీ మద్దతుదారులకు బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. ములకలపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని పలు గ్రామపంచాయతీల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు పైచేయి సాధించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో సర్పంచ్ స్థానాలను దక్కించుకున్నారు
రెండో విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా
అత్యధికం హస్తగతం
అత్యధికం హస్తగతం
అత్యధికం హస్తగతం
అత్యధికం హస్తగతం


