● పోలింగ్ కేంద్రాల్లో కలెక్టర్ సందర్శన
దమ్మపేట/అశ్వారావుపేటరూరల్ : దమ్మపేట మండలం జమేదార్‌బంజర, అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం సందర్శించారు. పోలింగ్ సరళిని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా, ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ పాత అల్లిగూడెం, నారంవారిగూడెం కాలనీ, నారంవారిగూడెం, జమ్మిగూడెం, ఊట్ల పల్లి, వినాయకపురం, అనంతారం, గాండ్లగూడెం తదితర కేంద్రాలను సందర్శించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ విద్యా చందన, తహసీల్దార్ సీహెచ్‌వీ రామకృష్ణ, ఎంపీడీఓ అప్పారావు పాల్గొన్నారు. పాల్వంచ డీఎస్పీ సతీష్‌కుమార్ కూడా పలు కేంద్రాలను పరిశీలించారు.
పోలింగ్ ప్రశాంతం
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో రెండో దశ గ్రామపంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆదివారం ఎన్నికలు జరిగిన ఏడు మండలాల్లో మొత్తం 1,96,395 మంది ఓటర్లు ఉండగా, 1,62,323 మంది ఓటు హక్కు వినియోగించుకున్నాని, మొత్తంగా 82.65 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో 85.13 శాతం, అశ్వారావుపేటలో 87.85, చంద్రుగొండలో 85.93, చుంచుపల్లిలో 66.19, దమ్మపేటలో 85.73, ములకలపల్లిలో 86.59, పాల్వంచ మండలంలో 86.58 శాతం పోలింగ్ నమోదైందని వివరించారు.


