మలిదశ మెరుగే..
భ ద్రాద్రి గంటకు
గంటకు ఇలా...
ఖమ్మం గంటకు గంటకు ఇలా...
చుంచుపల్లి: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాల్లోని 138 గ్రామ పంచాయతీలు, 1,123 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. ఓటింగ్ ప్రారంభమైన మొదటి రెండు గంటల పాటు చలి ప్రభావంతో 21.93 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఓటర్లు తరలి రావడంతో పలు పోలింగ్ కేంద్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. 11 గంటల వరకు 57.57 శాతం మేర ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత రెండు గంటల పాటు ఓటర్లు భారీగా తరలివచ్చారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులను ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అభ్యర్థులు, వారి అనుచరులు కృషి చేశారు. ఎట్టకేలకు చివరకు 82.65 శాతం పోలింగ్ నమోదు కాగా, ఏడు మండలాల పరిధిలో 1,96,395 మంది ఓటర్లకు గాను 1,62,323 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండో విడత ఎన్నికల్లో కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు రావడం విశేషం. కాగా, మొదటి విడత జరిగిన ఎన్నికల్లో జిల్లాలో 71.79 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. మొదటి విడత కంటే రెండో దశలో 11 శాతానికి పైగా ఓటింగ్ పెరిగింది.
ఉన్నతాధికారుల పరిశీలన..
మలి విడత పోలింగ్ ప్రక్రియను పలువురు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ట్రైనీ కలెక్టర్ సౌరభ్‌శర్మ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. చుంచుపల్లి మండలంలో ఎన్నికల పరిశీలకులు సర్వేశ్వర్‌రెడ్డి, చుంచుపల్లి తండా, బాబూక్యాంప్, రామాంజనేయకాలనీ కేంద్రాలను ఎస్పీ రోహిత్‌రాజు తనిఖీ చేశారు. జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరిగిన 138 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 386 మంది, 1,123 వార్డులకు 2,820 మంది పోటీ పడగా, పోలింగ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదట వార్డులకు, తరువాత సర్పంచ్ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించారు. ప్రతీ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
ఆ తర్వాత
82.91
మలిదశ మెరుగే..
మలిదశ మెరుగే..
మలిదశ మెరుగే..
మలిదశ మెరుగే..
మలిదశ మెరుగే..
మలిదశ మెరుగే..


