కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్య కల్యాణ వేడుక ఆదివారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచ నం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
రామయ్యకు వెండి పల్లెం బహూకరణ
శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఆదివారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం, దుప్పలపూడి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి, రామలక్ష్మి రూ.1.50 లక్షల విలువైన వెండి పళ్లెం బహూకరించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకోగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు.


