మేమూ ఓటేశాం..
● ఆసక్తి, ఆనందంతో తొలిసారి ఓటు హక్కు వినియోగం ● ఎన్నికల ప్రక్రియలో భాగమైనందుకు యువతీయువకుల్లో హర్షం
మొదటిసారి నా ఓటు హక్కు గ్రామపంచాయతీ ఎన్నికల్లో వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. ఓటు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అందుకే బాధ్యతగా ఓటేశాను.
– కొర్రా అంజలి, కామేపల్లి
గ్రామపంచాయతీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయడం ఆనందంగా ఉంది. అభివృద్ధి చేస్తా రని భావించిన అభ్యర్థులను నేను ఓటు వేశారు. – లకావత్ అమృత, పునుకుల
తొలిసారి ఓటు హక్కు లభించిన యువతీయువకులు ఉత్సాహంగా ఓటేశారు. రాజ్యాంగ హక్కును వినియోగించుకుని.. గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటేశామని.. మొదటిసారి ఓటేయడం బాధ్యతగా భావించడంతోపాటు మధురానుభూతిని కలిగించిందని.. గెలుపులో యువత ఓట్లే కీలకమని.. సమర్థులైన సర్పంచ్‌ల ఎన్నికల్లో భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉందని యువ ఓటర్లు పేర్కొన్నారు. ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా, పలువురు యువతీ, యువకులు ఆసక్తి, ఆనందంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. – దమ్మపేట/అశ్వారావుపేట రూరల్/చుంచుపల్లి/పాల్వంచ రూరల్/కామేపల్లి
మేమూ ఓటేశాం..
మేమూ ఓటేశాం..
మేమూ ఓటేశాం..


