● కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
టేకులపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శనివారం ఆయన మండలంలోని వివిధ గ్రామాల్లో అభ్యర్థులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని 36 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతు తెలిపిన సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించాలని కోరారు. కార్యకర్తలతో కలిసి స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కోరం సురేందర్, భూక్యా దేవా నాయక్, ఈది గణేష్ , బాణోతు భద్రు, బండ్ల రజిని, బోడ మంగీలాల్ పాల్గొన్నారు.
ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య


