ఓట్లు వేయలేదని దూషిస్తున్నారు..
అశ్వాపురం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో డబ్బు తీసుకుని ఓటు వేయలేదంటూ కొందరు దూషిస్తున్నారంటూ అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామస్తులు వాపోయారు. ఓట్లు వేయలేదని కొందరు తమ ఇళ్ల ముందుకు వచ్చి తిడుతున్నారని, మహిళలను దూషిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు పెద్దసంఖ్యలో శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టగా ఉద్రిక్తత నెలకొంది. సీఐ అశోక్‌రెడ్డి నచ్చజెప్పినా వినకపోవడంతో మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి చేరుకొని ఇరువర్గాలతో మాట్లాడి తగాదాలు వీడి కలిసికట్టుగా ఉండాలని సూచించారు. అయినా గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని కోరగా ఫిర్యాదు చేయాలని చెప్పారు. దీంతో బొల్లినేని గణేష్ ఫిర్యాదు మేరకు 13 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట గ్రామస్తుల ఆందోళన


