● న్యూడెమోక్రసీ అభ్యర్థులను గెలిపించాలి
గుండాల: ఏజెన్సీ ప్రాంత సమస్యలే ఎజెండాగా పోరాడుతున్న న్యూడెమోక్రసీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు అన్నారు. శనివారం కాచనపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాయమాటలు చెప్పే పార్టీలను ప్రజలు నమ్మి మోసపోవద్దని సూచించారు. అధికార పార్టీ డబ్బు, మద్యం ఆశ చూపుతూ ఓటర్లను తమవైపు తిప్పుకుంటోందని ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడుతూ, అక్రమ కేసులు బనాయిస్తే భయపడే ప్రసక్తే లేదని అన్నారు. గుండాల మండలంలోని కాచనపల్లిలో జర్పుల కిష న్, గుండాలలో సీతారాములు, పడుగోనిగూడెంలో రవి, చెట్టుపల్లిలో ఇర్ప రాజేష్‌లను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు అటి కం నాగేశ్వరరా వు, బొర్ర వెంకన్న, రమేష్, రంగన్న తదితరులు పాల్గొన్నారు.
కిడ్నాప్‌లు, బెదిరింపులకు భయపడేది లేదు
కాంగ్రెస్ సీనియర్ నాయకులు న్యూడెమోక్రసీకి మద్దతు ఇస్తుండగా ఓటమి భయంతోనే కాంగ్రెస్ అభ్యర్థితోపాటు ఇతర నాయకులు కిడ్నాప్‌లకు, బెదిరింపులకు పాల్పడతున్నారని, అయినా తాము భయపడబోమని ఆ పార్టీ నాయకుడు ఆవునూరి మధు అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శుక్రవారం రాత్రి జగ్గాయిగూడెం గ్రామానికి చెందిన పొంబోయిన హరినాథ్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకునిపోయి భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని అన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కోరం సీతారాములు, ఈసం పాపారావు, సుధాకర్, వీరన్న, తెల్లం భాస్కర్, యాసారపు వెంకన్న, అరెం నరేష్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు


