ఆశ్రమ పాఠశాల సందర్శన
చండ్రుగొండ: మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలను ట్రైబల్ వెల్ఫేర్ అడిషినల్ డైరెక్టర్ (పంచాయతీ ఎన్నికల రాష్ట్ర పరిశీలిలకులు) సర్వేశ్వరరెడ్డి శుక్రవారం సందర్శించారు. పాఠ శాలలో మెనూ, విద్యాభ్యాసం జరుగుతున్న తీరు తెన్నులపై విద్యార్థినులతో మాట్లాడి తెలుసుకున్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్ పాల్గొన్నారు.
ప్రభుత్వాస్పత్రిలో
డీఎంహెచ్‌ఓ తనిఖీ
సుజాతనగర్: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో డీఎంహెచ్‌ఓ తుకారాంరాథోడ్ శుక్రవారం తనిఖీ చేశారు. గర్భిణులకు అందుతున్న సేవలు, 30 ఏళ్లు పైబడినవారికి బీపీ, షుగర్ పరీక్షలు, చికిత్స, కీటక జనిత వ్యాధుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. చిన్నపిల్లల టీకాలు, 14 ఏళ్ల బాలికలకు నూతనంగా అందించబోతున్న హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ గురించి వివరించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యుడు రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
సింగరేణి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా బాలరాజు
రుద్రంపూర్: సింగరేణి కార్పొరేట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా రిటైర్డ్ డీఎస్పీ పి.బాలరాజును నియమిస్తూ యాజమా న్యం ఇటీవల ఉత్తర్వు లు జారీ చేసింది. ఆయ న ఈ పదవిలో ఏడాదిపాటు కాంట్రాక్ట్ పాత్రిపదికన ఉంటారు.
దాడులపై కేసు నమోదు
చింతకాని: మండలంలోని రామకృష్ణాపురం, బస్వాపురంల్లో ఎన్నికల సందర్భంగా ఇళ్లపై దాడి చేసిన వారిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. రామకృష్ణాపురంలో కన్నెబోయిన కుటుంబరావు ఇంటిపై ఉసికల లక్ష్మీనారాయణతో పాటు మరో 14 మంది కర్రలు, రాళ్లతో దాడి చేశారు. రెండు బైక్‌లు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. కుటుంబరావు ఫిర్యాదుతో 15మందిపై కేసునమోదు చేశారు. బస్వాపురంలో సుంకసాని విజయలక్ష్మి ఇంటిపై కుక్కల నాగరాజుతో పాటు మరో 12 మంది దాడి చేయగా ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కొదుమూరు, నర్సింహాపురం, అనంతసాగర్లలో జరిగిన ఘర్షణలపై మరో 37 మందిపై కేసులు నమోదు చేశామని వివరించారు.
ఆశ్రమ పాఠశాల సందర్శన
ఆశ్రమ పాఠశాల సందర్శన


