భద్రగిరి పీఠం కాంగ్రెస్‌దే..
● 20 వార్డులకు గాను 15 వారివే ● సర్పంచ్‌గా పూనెం కృష్ణ, ఉపసర్పంచ్‌గా రత్నం కవిత
భద్రాచలం: జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి.. అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ప్రచారం సాగిన భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీని కాంగ్రెస్ వశం చేసుకుంది. సర్పంచ్ స్థానంతో పాటుగా 20 వార్డులకు గాను 15 వార్డులలో వారి మద్దతుదారులు జయకేతనం ఎగురవేశారు. దీంతో సుదీర్ఘ కాలం అనంతరం, తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థి పూనెం కృష్ణ విజేతగా నిలిచాడు. సర్పంచ్ స్థానానికి మొత్తం 19,838 ఓట్లు పోలవ్వగా పూనెం కృష్ణ 8,416 ఓట్లు సాధించి, తొలి స్థానంలో, బీఆర్‌ఎస్ మద్దతుదారుడు మానె రామకృష్ణ 6,732 ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. బీజేపీ కూటమి అభ్యర్థి హరిశ్చంద్రనాయక్ 2,756 ఓట్లు సాధించారు. ఇక ఓటుకు నోటొద్దంటూ వినూత్నంగా ప్రచారం చేసిన పూనెం ప్రదీప్‌కుమార్ 298 ఓట్లను సాధించారు.
ఉపసర్పంచ్ కాంగ్రెస్‌దే..
భద్రాచలంలో హోరాహోరీగా సాగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డుల్లో సైతం కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది. 20 వార్డులకు గాను 15 వార్డుల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలవడంతో ఉపసర్పంచ్ పదవి సైతం కాంగ్రెస్‌కే దక్కింది. 16వ వార్డులో గెలిచిన రత్నం కవితను ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. సీపీఎంకు రెండు, బీఆర్‌ఎస్‌కు ఒకటి, టీడీపీకి ఒకటి, ఇండిపెండెంట్‌కు ఒకటి దక్కాయి.
20 వార్డుల్లో విజేతలు వీరే..
1వ వార్డులో చెంచు సుబ్బారావు(కాంగ్రెస్), 2వ వార్డు బొంబోతుల రాజీవ్(కాంగ్రెస్), 3వ వార్డు బొంత రమణ(కాంగ్రెస్), 4వ వార్డు బండారు శరత్(సీపీఎం), 5వ వార్డు నర్రా వాణి(కాంగ్రెస్), 6వ వార్డు అబ్బినేని వినీలా రాణి (టీడీపీ), 7వ వార్డు కావూరి గోపి (బీఆర్‌ఎస్), 8వ వార్డు పెద్దినేని లక్ష్మి (కాంగ్రెస్), 9వ వార్డు కారం సుజాత (కాంగ్రెస్), 10వ వార్డు నిట్టా రాజు(కాంగ్రెస్), 11వ వార్డు భూక్యా సుశీల(కాంగ్రెస్), 12వ వార్డు కారం దుర్గారావు (కాంగ్రెస్), 13వ వార్డు తాటి ఉదయ్ (కాంగ్రెస్), 14వ వార్డు ఇలమల అశోక్‌కుమార్ (ఇండిపెండెంట్), 15వ వార్డు (కాంగ్రెస్), 16వ వార్డు రత్నం కవిత (కాంగ్రెస్), 17వ వార్డు సున్నం భూలక్ష్మి (కాంగ్రెస్), 18వ వార్డు జగ్గా కుమారి(కాంగ్రెస్), 19వ వార్డు మహేశ్(సీపీఐ), 20వ వార్డు ఇర్పా అనుసూయ(సీపీఎం) గెలుపొందారు.
భద్రగిరి పీఠం కాంగ్రెస్‌దే..


