‘అమృత్’ పనులు పరిశీలన
కొత్తగూడెంఅర్బన్: భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అమృత్ పథకం పనులను శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవా త్సవ పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు వినతిపత్రాలను అందజేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్‌యూసీసీ మెంబర్ శ్రీనివాస్‌రెడ్డి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని, తిరుపతి, షిరిడీలకు రైలు సౌకర్యం ఏర్పాటు చేయాలని, బెల్గావి, డోర్నకల్–కాజీపేట ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. న్యూ గొల్లగూడెం వరకు రోడ్డు విస్తరణ పనులకు క్లియరెన్స్ ఇవ్వాలని కోరారు. అధికారులు గోపాలకృష్ణయ్య, మల్లాది శ్రీనివాస్, సిఫాలి, రాజేంద్రప్రసాద్, పాషా, విశ్వనాథ్, దిశా కమిటీ సభ్యుడు ఆనందరావు, శ్రీకాంత్, ఎం.రామకృష్ణ, కొదుమూరి శ్రీనివాసరావు, కంభంపాటి రవి పాల్గొన్నారు.
రామయ్య సేవలో..
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారిని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ దామోదర్‌రావు స్వాగతం పలుకగా ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులకు పూజలు చేశారు. ఉపాలయంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను, జ్ఞాపిక అందచేశారు. రైల్వే అఽధికారులు, ఏఈఓ శ్రవణ్‌కుమార్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


