ఎన్‌సీసీతోనే క్రమశిక్షణ
కమాండింగ్ ఆఫీసర్
కల్నల్ సంజయ్‌కుమార్ భద్ర
టేకులపల్లి : యువతలో నాయకత్వ లక్షణాలు, ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి వంటివి ఎన్‌సీసీతోనే పెంపొందుతాయని, ఈ మేరకు శిక్షణ ఇస్తామని 11 టీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్ కుమార్ భద్ర అన్నారు. స్థానిక ఏకలవ్య(ఈఎంఆర్‌ఎస్) పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్‌సీసీ ప్రాథమిక శిక్షణలో డ్రిల్, రైఫిల్ డ్రిల్, మ్యాప్ రీడింగ్, వెపన్ ట్రైనింగ్, ిఫీల్డ్ క్రాఫ్ట్, రాక్ క్‌లైంబింగ్, మౌంటనీరింగ్, ట్రెక్కింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఎన్‌సీసీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పాఠశాలలో ఎన్‌సీసీ ఏర్పాటుకు ప్రిన్సిపాల్ నిశాంత్ కృష్ణ తీసుకున్న చొరవను ఆయన అభినందించారు. ఎన్‌సీసీ కేడెట్ల ఆసక్తి, క్రమశిక్షణ చూసి హర్షం వ్యక్తం చేశారు.


