అంతా ప్రశాంతం..
తొలి విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగాయి. చెదురుముదురు ఘటనలు మినహా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పోలింగ్ ముగిసింది. యువకులు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకోగా.. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వృద్ధులు, నడవలేనివారి కోసం వీల్‌చైర్లు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల వృద్ధులను ఎత్తుకుని పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, రేగా కాంతారావు.. వారివారి గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. –సాక్షి నెట్‌వర్క్


