సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా పెట్టాలి
కొత్తగూడెంటౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ రోహిత్‌రాజు పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రజలు నిర్భయంగా ఓటు వేసేలా భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా ఎవరైనా ప్రవర్తిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేయాలని అన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐలు ప్రతాప్ ,శ్రీలక్ష్మి, వెంకటేశ్వర్లు, ఎస్సైలు రమణారెడ్డి, రమాదేవి, జయసింహారెడ్డి, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశం


