గోదావరి బ్రిడ్జిపై మరమ్మతులు
భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరిపై ఉన్న పాత బ్రిడ్జికి అధికారులు ఎట్టకేలకు మరమ్మతులు చేశారు. రెండు బ్రిడ్జిలపై నెలకొని ఉన్న సమస్యలపై ‘వారధికి మరమ్మతులేవి..?’, ‘అమాత్యులైన మీరైనా..’శీర్షికన ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. స్థానికులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను ఎత్తి చూపింది. దీంతో స్పందించిన జిల్లా అధికారులు మొదటి బ్రిడ్జిపై ఉన్న గుంతలను పూడ్చారు. కుంగిపోయిన అప్రొచ్‌రోడ్‌కు ప్యాచ్‌వర్క్ పూర్తి చేశారు. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రెండు బ్రిడ్జిలపై నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, నూతన బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
గోదావరి బ్రిడ్జిపై మరమ్మతులు


