●ఒకే కుటుంబం నుంచి ఐదుగురు..
జూలూరుపాడు: మండలంలోని కొత్తూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, టీడీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా అక్కుల నరసింహారావు పోటీ చేస్తుండగా, అతని సోదరుడు అక్కుల రాములు సీపీఐ బలపరిచిన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరి తల్లి అక్కుల నారమ్మ 2వ వార్డు నుంచి, సర్పంచ్ అభ్యర్థి రాములు పెద్ద కుమారుడు రాజేష్ 6వ వార్డు నుంచి, మరో సోదరుడు అక్కుల చిన్న రాములు 7వ వార్డు నుంచి బరిలో నిలిచారు. దీంతో కొత్తూరు పంచాయతీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.
●ఒకే కుటుంబం నుంచి ఐదుగురు..


