పెద్దమ్మతల్లి ఆలయంలో పూజలు
పాల్వంచరూరల్: మండలంలోని పెద్దమ్మతల్లిని డీసీసీ అధ్యక్షులు తోట దేవీప్రసన్న, జగన్నాథపురం అభ్యర్థి బి.అనితతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం మండలంలోని జగన్నాథపురంలో పోటీ చేస్తున్న అనితతో కలిసి దేవీప్రసన్న ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బానేని నాగేశ్వరరావు, దార్ల జ్యోషి, నందనాయక్, బాదర్ల నాగేశ్వరరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
పుష్కరఘాట్ల పరిశీలన
దుమ్ముగూడెం: మండలంలోని పర్ణశాల, దుమ్ముగూడెం గ్రామాల్లోని పుష్కరఘాట్లను హైదరబాద్‌కు చెందిన ప్రైవేట్ ఈవై కన్సల్టెన్సీ బృందం సభ్యులు సాయితేజ, కుసా, తాహరీం మంగళవారం పరిశీలించారు. 2027లో జరుగనున్న గోదావరి పుష్కరాలకు అనువుగా పుష్కరఘాట్లను ఏర్పాటు చేసేందుకు తొలుత పర్ణశాల ఘాట్లను పరిశీలించి ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పర్ణశాలలో ఘాట్‌ల నిర్వహణ ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయని, అందుకు గాను దుమ్ముగూడెం వద్ద ఘాట్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. అనంతరం దుమ్ముగూడెంలోని నందులరేవు పుష్కరఘాట్‌లను ఫొటోలు తీసుకుని వెళ్లారు. వారి వెంట ఇరిగేషన్ జేఈ రాజ్‌సుహాస్, పీటీ మస్తాన్‌వలీ తదితరులు పాల్గొన్నారు.
ఓటర్లకు ఇబ్బందులు
లేకుండా చూడాలి..
● ఎన్నికల జిల్లా సాధారణ
పరిశీలకులు సర్వేశ్వరరెడ్డి
బూర్గంపాడు: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పలు పోలింగ్ కేంద్రాలు, చెక్‌పోస్టులను జిల్లా సాధారణ పరిశీలకులు వి.సర్వేశ్వరరెడ్డి మంగళవారం పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి పంపిణీ చేసే ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, టోకెన్ల పంపిణీతోపాటు మోరంపల్లి బంజర జెడ్పీహెచ్‌ఎస్, పినపాకపట్టీనగర్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపులు, లైటింగ్ వంటి సదుపాయాలపై అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మోరంపల్లి బంజర, కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. డబ్బు, మద్యం రవాణాను అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
మాజీ మావోయిస్టు నాయకుడు మృతి
అశ్వాపురం: మండలంలోని చింతిర్యాల గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు నాయకుడు తోట సీతారామయ్య(70) అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందారు. ఆయన 1980లో విప్లవోద్యమంలో భాగమయ్యాడు. కొంత కాలం పీస్ బుక్ సెంటర్‌లో విప్లవ సాహిత్యాన్ని అమ్మే పనిచేయగా అప్పుడు పీబీసీ కుమార్ అని పిలిచేవారు. 1985లో పీస్‌బుక్ సెంటర్ మూసేశాక కొరియర్‌గా పనిచేశాడు. డీటీపీ, ఆప్‌సెట్ ప్రింటింగ్ నేర్చుకొని విప్లవ సాహిత్యాన్ని అచ్చువేసి ఉద్యమ ప్రాంతాలకు తరలించేవాడు. 2001నుంచి దండకారణ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతికి కంప్యూటర్ ఆపరేటర్‌గా, సహాయకుడిగా పనిచేయడం ప్రారంభించారు. ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన సీతారామయ్య 2023లో చికిత్స కోసం బయటకు వచ్చి పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల కాగా, అనారోగ్యంతో చింతిర్యాలలో ఉంటూ సోమవారం మృతి చెందగా, మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు.
పెద్దమ్మతల్లి ఆలయంలో పూజలు
పెద్దమ్మతల్లి ఆలయంలో పూజలు
పెద్దమ్మతల్లి ఆలయంలో పూజలు


