అప్రమత్తతతోనే ప్రమాదాలకు చెక్..
మణుగూరుటౌన్: మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు జరుగుతాయని, విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటే జరగవని రక్షణ తనిఖీ బృందం కన్వీనర్, జీఎం (ఈఅండ్‌ఎం) దామోదర్‌రావు అన్నారు. మంగళవారం 56వ రక్షణ పక్షోత్సవాల సందర్భంగా మణుగూరు ఏరియా వర్క్ షాప్‌ను రక్షణ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా వర్క్‌షాప్‌లో ఇన్‌చార్జ్ ఏరియా ఇంజనీర్ వీరభద్రుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థపై కృతజ్ఞత భావం, వ్యక్తిగత రక్షణ పరికరాలు, మెరుగైన పర్యవేక్షణ, పనిలో అంకితభావం, సమష్టి కృషి, సమయపాలన వంటి అంశాలు రక్షణతో కూడిన పనికి దోహదపడతాయన్నారు. ఏరియా జీఎం దుర్గం రాంచందర్ మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా పనిచేస్తే జీవితంలో చీకటి మిగిలుతుందని, విద్యుత్ పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా సింగరేణి మాజీ కార్మికుడు ఎస్‌డీ నాజర్‌పాషా రచన, దర్శకత్వంలో సింగరేణి కళాకారులు ప్రదర్శించిన ‘తస్మాత్ జాగ్రత్త’నాటకం ఆకట్టుకుంది. కార్యక్రమంలో అధికారులు టి.శ్రీకాంత్, వెంకట రామారావు, శ్రీనివాసాచారి, గుర్తింపు సంఘం నాయకులు వై.రాంగోపాల్, ఐఎన్‌టీయూసీ నాయకులు కృష్ణంరాజు, ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు మదన్‌నాయక్, రక్షణ తనిఖీ బృందం సభ్యులు కృష్ణారెడ్డి, దామోదర్, సురేశ్, సుధాకర్ తదితరులు ఉన్నారు.
రక్షణ తనిఖీ బృందం కన్వీనర్,
జీఎం (ఈఅండ్‌ఎం) దామోదర్‌రావు


