సర్పంచ్ బరిలో గర్భిణి!
అశ్వారావుపేటరూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఏడు నెలల గర్భిణి సర్పంచ్ పదవికి పోటీచేస్తోంది. మండలంలోని పాతరెడ్డిగూడెం గ్రామ పంచాయతీలో మొత్తం 644 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 310 మంది పురుషులు, 334 మంది సీ్త్రలు ఉన్నారు. అత్యధికంగా కొండరెడ్ల ఓటర్లు ఉండగా, సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. కొండరెడ్డి సామాజిక వర్గానికే చెందిన ఉమ్మల వెంకటరమణ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆమె ప్రస్తుతం 7 నెలల గర్భంతోనే ప్రచారం నిర్వహిస్తోంది. వెంకటరమణ డిగ్రీ పూర్తి చేసింది.
టేకులపల్లి: సర్పంచ్ బరిలో గర్భిణీ నిలిచింది. మండలంలోని చంద్రుతండాకు చెందిన భూక్య రాజా సతీమణి శైలజ ప్రస్తుతం 8 నెలల గర్భిణి. కాంగ్రెస్ తరఫున చంద్రుతండా పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. మంగళవారం నుంచి గ్రామంలో ప్రచారం చేస్తోంది.
సర్పంచ్ బరిలో గర్భిణి!


