మద్యం రవాణా అరికట్టాలి
ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య సూచించారు.
వాతావరణ ం
జిల్లాలో మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి. రాత్రి వేళ చలి ప్రభావం మాత్రం మరింతగా పెరుగుతుంది.
కామేపల్లి: కామేపల్లి మండలం పాతలింగాలకు చెందిన దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి గ్రామ సర్పంచ్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగారు. స్వగ్రామానికి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై న వెంకటరెడ్డి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. 1967లో రాజకీయ ప్రవేశం చేసిన ఆయన ఉమ్మడి పంచాయతీగా లింగాల సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచారు. 1977లో ఏకగ్రీవం కాగా.. పదేళ్లు సర్పంచ్‌గా పని చేశారు. 1996లో సుజాతనగర్‌లో ఉప ఎన్నిక రావడంతో అక్కడ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మళ్లీ 1999, 2004 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా పాలేరు నుంచి 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే, 2009లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా, 2016లో అనారోగ్యంతో ఆయన మృతి చెందారు.


