గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి

Dec 9 2025 9:18 AM | Updated on Dec 9 2025 9:18 AM

గిరిజ

గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఐటీడీఏలో నిర్వహించే గిరిజన దర్బార్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏపీఓ డేవిడ్‌ రాజ్‌ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించిన దర్బార్‌లో అర్జీలు మాత్రమే స్వీకరించినట్లు పేర్కొన్నారు. అర్జీల వివరాలు ప్రత్యేక రిజిస్టర్‌తోపాటు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని చెప్పారు. ఎన్నికల నియమావళి ముగిశాక సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.

నిరుద్యోగులకు

ఉచిత శిక్షణ

జూలూరుపాడు: భద్రాచలం ఐటీసీ, ప్రతం ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్‌ వెంకట్రామ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బూర్గంపాడులో పురుషులకు ఎలక్ట్రికల్‌, సోలార్‌ రంగంలో శిక్షణ, భద్రాచలంలో మహిళలకు బ్యూటీషియన్‌ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఉచిత భోజన వసతి కూడా ఉంటుందని, 18–35 ఏళ్ల వయస్సు కలిగిన 8, 9, 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా చదువుకున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.

వలంటీర్ల ఎంపికకు దరఖాస్తులు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): యూత్‌ వలంటీర్ల ఎంపిక కోసం ఉమ్మడి జిల్లాలోని యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేరా యువ భారత్‌ డిప్యూటీ డైరెక్టర్‌ చింతల అన్వేష్‌ తెలిపారు. ఏడాది సమాజసేవ నిమిత్తం 2025 ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి 18–29 ఏళ్ల వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని, చదువుతున్న వారు, ఉద్యోగులు అనర్హులని స్పష్టం చేశారు. ఎంపికై న వలంటీర్లకు నెలకు రూ.5వేలు స్టైఫండ్‌ చెల్లించనున్నందున యువజన సంఘాల స్థాపన, క్రీడలు, ఆరోగ్యం, అక్షరాస్యత, లింగ వివక్ష తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగి కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్‌ కలిగిన వారు https:// nyks.nic.in/ NationalCrops/nyc.html ద్వారా మండలాన్ని ఎంచుకుని ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 08742–296777 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.

రాష్ట్రస్థాయి బీచ్‌ వాలీబాల్‌ పోటీల్లో ప్రతిభ

ఖమ్మం స్పోర్ట్స్‌: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్‌–17 బాలబాలికల బీచ్‌ వాలీబాల్‌ పోటీలను ఖమ్మం సీక్వెల్‌ రిసార్ట్స్‌లోని కృత్రిమ బీచ్‌లో సోమవారం జరిగాయి. పోటీలకు పాత పది జిల్లాల నుంచి 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈమేరకు బాలుర విభాగంలో ఖమ్మం జట్టు విజేతగా నిలవగా, రెండు, మూడో స్థానాల్లో మెదక్‌, నిజామాబాద్‌ జట్లు నిలిచాయి. ఇక బాలికల విభాగంలో ప్రథమస్థానం నిజామాబాద్‌ జట్టు సాధించింది. ద్వితీ య, తృతీయ స్థానాల్లో ఖమ్మం, హైదరాబాద్‌ జట్లు నిలిచాయి. విజేతల జట్లకు పోటీల రాష్ట్ర పరిశీలకులు మధు అందజేయగా, వాలీబాల్‌ అసోసియేషన్‌జిల్లాకార్యదర్శి బి.గోవిందా రెడ్డి, జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి వై.రామారావుతో పాటు డి.సైదులు, ఆదర్శ్‌కుమార్‌, నాగూల్‌మీరా, చిన్ని, అంజయ్య పాల్గొన్నారు.

‘కంపా’ నిధులెన్ని కేటాయించారు?

ఖమ్మంమయూరిసెంటర్‌: సాగునీరు, విద్యుత్‌ సహా వివిధ రకాల ప్రాజెక్టుల కోసం తీసుకునే అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే భూముల్లో అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం కాంపెన్సేటరీ అఫారేస్టేషన్‌ మేనేజ్మెంట్‌ ప్లానింగ్‌ అథారిటీ(కంపా) నిధులను ఎంత మేర కేటాయించారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించారని ఆయన సోమవారం లోక్‌సభలో అడిగారు. దీంతో ‘కంపా’ నిధుల్లో భాగంగా తెలంగాణకు ఇప్పటివరకు రూ.3,852.61 కోట్లు అందించినట్లు కేంద్ర అటవీ శాఖ సహాయ మంత్రి సమాధానం ఇచ్చారు.

గిరిజన సమస్యల  పరిష్కారానికి కృషి1
1/1

గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement