ఓటుకు నోటొద్దంటూ..
భద్రాచలం: విలువైన ఓటును నోటుకు అమ్ముకోవద్దని, పైసాకు అమ్ముడుపోతే ఐదేళ్లు బానిస కావాలని, అభివృద్ధే ప్రధానంగా సర్పంచ్‌కు ఎన్నుకోండంటూ ఓ అభ్యర్థి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీలో ఆదివాసీ పూనెం ప్రదీప్‌కుమార్ సర్పంచ్ బరిలో నిలిచాడు. మిగతా అభ్యర్థులకు భిన్నంగా ప్రచారం సాగిస్తున్నాడు. కళాశాలలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లతో గ్రూపు మీటింగ్‌లు నిర్వహిస్తున్నాడు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశానని, ఓటర్లలో చైతన్యం తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొంటున్నాడు. తాను గెలిస్తే భద్రాచలం అభివృద్ధికి నిస్వార్థంగా పాటుపడతానని చెబుతున్నాడు.
సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం


