ఉన్నత విద్యకు తోడ్పాటు
● కేజీబీవీల్లో విద్యార్థినులకు పోటీ పరీక్షలపై ప్రత్యేక శిక్షణ ● ఉమ్మడి జిల్లాలో ఆరు పాఠశాలలు ఎంపిక ● నెల రోజుల నుంచి కొనసాగుతున్న తరగతులు
కరకగూడెం: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో చదువుతున్న విద్యార్థినులు పోటీ పరీక్షల్లో రాణించేలా, రాష్ట్ర, జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీట్లు సాధించేలా రాష్ట్ర సమగ్ర శిక్షా విభాగం అధికారులు చర్యలు చేపడుతున్నారు. విద్యార్థినుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 14 కేజీబీవీలు ఉండగా, వీటిలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 3,700 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ఖమ్మంలో జిల్లాలో 14 కేజీబీవీలు ఉండగా, 4,300 మంది విద్యనభ్యసిస్తున్నారు.
పెరగనున్న ఆదరణ
మెరుగైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణలతో కేజీబీవీలకు ఆదరణ పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని కేజీబీవీల్లో శిక్షణ అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. కేజీబీవీల్లో 6వ తరగతి, ఇంటర్‌లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది.
ఉన్నత విద్యకు తోడ్పాటు


