● ‘ఆయిల్‌పామ్’ ఆవేదన!
ఆదాయం వస్తుందని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రచారం చేస్తుండటంతో నాలుగైదేళ్లుగా పలువురు రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా, తోట ఏపుగా పెరిగినా పూత, కాత రావడంలేదు. దీంతో రైతులు అప్పులపాలవుతున్నారు. అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామానికి చెందిన రైతు ప్రసాద్ కూడా ఆయిల్‌పామ్ వేసి ఆందోళన చెందుతున్నాడు. ఐదేళ్ల క్రితం ఐదున్నర ఎకరాల్లో తోట సాగు చేశాడు. కాత లేక పోవడంతో దిక్కుతోచనిస్థితిలో రెండు రోజులుగా ఆయిల్‌పామ్ చెట్లను తొలగిస్తున్నాడు. చెట్లను జేసీబీతో తొలగించేందుకు మట్టలు అడ్డురావడంతో కూలీలతో నరికిస్తున్నాడు. చిత్రంలో కనిపిస్తున్న ఆయిల్‌పామ్ మోడు రైతు ఆవేదనకు అద్దం పడుతోంది.
–అశ్వారావుపేటరూరల్


