ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చర్యలు

Dec 9 2025 9:18 AM | Updated on Dec 9 2025 9:18 AM

ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చర్యలు

ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చర్యలు

పాల్వంచరూరల్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం స్టేజీ టూ ఎన్నికల అధికారులకు ఎన్నికల వ్యయం, మోడల్‌ఆఫ్‌ కండక్ట్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్‌, వార్డు అభ్యర్థుల ఖర్చులను పరిశీలించాలని చెప్పారు.

ప్రతి పైసాకు లెక్క రాయాలి

పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న సర్పంచ్‌, వార్డు సభ్యులతో ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యయాల జిల్లా నోడల్‌ అధికారి ఎ.శ్రీనివాస్‌ మాట్లాడుతూ వ్యయంలో ఎన్నికల నియమావళిని పాటిస్తూనే ఖర్చు చేసిన ప్రతి పైసాకు లెక్కలు రాయాలని సూపచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె.విజయభాస్కర్‌రెడ్డి, తహసీల్దార్‌ దారా ప్రసాద్‌, రూరల్‌ ఎస్‌ఐ.సురేశ్‌, శిక్షకులు రమేష్‌, పార్థసారథి పాల్గొన్నారు.

జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement