గొర్రెల చోరీకి యత్నం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం 7వ డివిజన్ టేకులపల్లి డైట్ కళాశాల సమీపాన సోమవారం గొర్రెల దొంగతనానికి కొందరు యత్నంచారు. డొంకరోడ్డు ప్రాంతంలో పొలాల వద్దకు యరదేశి మల్లయ్య, వెంకటేశ్వర్లు తమ గొర్రెలను మేతకు తీసుకెళ్లగా ఆటోలో వచ్చిన ఐదుగురు జీవాలను ఎత్తుకెళ్లేందుకు యత్నించినట్లు తెలిసింది. అప్రమత్తమైన కాపరులు తమ గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి నిందితులను పట్టుకుని ఖమ్మం అర్బన్ పోలీసులకు అప్పగించారు. ఈమేరకు ఐదుగురిని అదుపులోకి తీసుకోగా విచారణ చేపడుతున్నామని సీఐ భానుప్రకాశ్ వెల్లడించారు.


