టెట్ నుంచి మినహాయించాలి
అశ్వారావుపేటరూరల్: ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి అన్నారు. ఆదివారం అశ్వారావుపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో టీఎస్ యూటీఎఫ్ జిల్లా శాఖ విస్తృత కమిటీ సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు మురళీమోహన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెట్ అర్హత ఉంటేనే సర్వీసులో కొనసాగుతారని కోర్టు తీర్పు చెబుతుండగా, రాష్ట్రంలో 45వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందని అన్నారు. న్యాయస్థానం తీర్పు ఇచ్చి రెండు నెలల దాటినా కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు అన్ని సంఘాలను కలుపుకోని ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ నెల 10న దేశవ్యాప్తంగా ఉన్న సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. తొలుత పట్టణంలో డప్పు, కోలా నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి రాజు, ఎం వెంకటేశ్వర్లు, మడివి కృష్ణారావు, ఆర్ రమేష్, హతీరాం, వరలక్ష్మి, రాజయ్య, పద్మారాణి, సత్యనారాయణ పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి


