క్రీడలతో స్నేహ సంబంధాలు
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
అశ్వాపురం: క్రీడలతో స్నేహ సంబంధాలు బలోపేతమవుతాయని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండల కేంద్రంలోని గౌతమీనగర్ కాలనీలో హెవీవాటర్ ప్లాంట్ హోమిబాబా క్రీడామైదానంలో జరుగుతున్న అండర్–14 బాలుర రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ఆదివారం ముగిశాయి. పోటీల్లో విజేతగా రంగారెడ్డి, రన్నరప్‌గా హైదరాబాద్ జట్లు నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ హాజరై బహముతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. భారజల కర్మాగారం జీఎం శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


