గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి
అశ్వారావుపేటరూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఆదివారం నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశంలో విషాదం చోటుచేసుకుంది. సమావేశం జరుగుతుండగానే గుండెపోటుకు గురైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కట్టా మధు(45) హఠాన్మరణం చెందారు. అశ్వారావుపేటకు చెందిన మధు మండలంలోని దురదపాడు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఆయన యూటీఎఫ్ సమావేశం సందర్భంగా ర్యాలీ నిర్వహించిన తర్వాత కూప్పకూలి కిందపడిపోయారు. తోటి ఉపాధ్యాయులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


